Ticker

6/recent/ticker-posts

Nimma rasam : నిమ్మరసం ఆయుర్వేద ఉపయోగాలు తెలుగులో

Nimma rasam : నిమ్మరసంకు వున్న సుగుణాలను లెక్క పెడితే రెండు చేతులుకు వున్న వేళ్లు సరిపోవు. ప్రతి రోజూ ఉదయం,సాయంత్రం గోరు వెచ్చని నీళ్ళు తో కాస్త నిమ్మరసం కలుపుకుని తాగితే అద్భుత మైన ఫలితాలను పొందుతారు.

image show Nimma rasam

మానసిక ఒత్తిడి తగ్గించి కొత్త ఉత్సాహం నింపే ఔషధ గుణం నిమ్మరసంకు వుంది. కాలేయం లో పేరుకున్న విషతుల్యం పోగొట్టే గుణం నిమ్మరసం సొంతం. కాలేయం ను జీవిత కాలం కాపాడుతుంది

Nimma rasam : నిమ్మరసం ఆయుర్వేద ఉపయోగాలు

నిమ్మ లో దొరికినంత సి విటమిన్ మరే పండులోను దొరకదు. వయసు పెరుగుతున్న చర్మాన్ని ముడతలు పడనివ్వదు. ఇది యాంటీ సెప్టిక్ గా పని చేయడం వల్ల చర్మ సమస్యలు దరిచేరవు. ఎప్పుడైనా కలుషితమైన నీరు తాగినప్పుడు గొంతు నొప్పి వస్తుంది. దీనికి సరైన విరుగుడు నిమ్మరసం వెంటనే ఉపశమ నాన్ని ఇస్తుంది

పంటి నొప్పిని తగ్గించే గుణం నిమ్మరసంకు ఉంది. పంటి నుండి వచ్చే రక్తస్రావాన్ని నిలిపి వేస్తుంది. లెమన్ వాటర్ గమ్ నమిలిన ఫలితం కనిపిస్తుంది. నిమ్మలో యాంటీ ఆక్సిడెంట్ దండిగా ఉంటాయి.

వేడి నీటితో నిమ్మరసం కలిపి తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ శుభ్రపడు తుంది.  మలబద్ధకం  సమస్య దగ్గుతుంది. గ్యాస్ అజీర్తి సమస్యలు కూడా తగ్గుతాయి. Nimma rasam రక్తంలో త్వరగా కలిసి అన్ని అవయవాలను ఉత్తేజ పరుస్తాయి. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.

భోజనానికి ముందు నిమ్మరసం తాగడం వల్ల PH స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు వచ్చిన తట్టుకునే శక్తి పెరుగుతుంది. నిమ్మరసం యూరిక్ యాసిడ్ను పలచన చేసి నొప్పులు తగ్గించేందుకు సహాయపడుతుంది.

Nimma rasam లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో సోడియం తో కలిసి మెదడును ఉత్తేజ పరుస్తుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. రక్తంలో మెగ్నీషియం క్యాల్షియం నిల్వలు నిమ్మరసం వల్ల అధికమవుతాయి

పరగడుపున నిమ్మరసం తాగితే బరువు తగ్గుతారు. శరీరంలో fat శాతం తగ్గుతుంది. మెట బాలిజం పెరుగుతుంది. నిమ్మరసం త్రాగటం వల్ల కిడ్నీలు మంచిగా పని చేస్తాయి.

Post a Comment

0 Comments